సమావేశంలో మాట్లాడుతున్న బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన మేరకు పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలను ఇవ్వాలని గిరిజన, ఆదివాసీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాసలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి.
కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తమ్మినేని వీరభద్రం పలు తీర్మానాలను ప్రతిపాదించగా, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలు, నష్టాలపై అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలంటూ చేసిన మొత్తం ఏడు తీర్మానాలను రాష్ట్ర కమిటీ ఆమోదించింది.
చలో హైదరాబాద్‌కు మద్దతు
ఆగస్టు 3న కార్మికులు తలపెట్టిన చలో హైదరాబాద్‌కు సీపీఎం మద్దతిస్తున్నట్లు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ప్రజా సమస్యల మీద నిరంతరం సమరశీల పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవు లు, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment