సాక్షి, మహబూబాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర పునఃర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాణలు కోరిన తర్వాతే వరంగల్‌లో అడుగుపెట్టాలని అన్నారు. ములుగులో రాష్ట్ర ప్రభుత్వం 360 ఎకరాల భూమి కేటాయించినప్పటికీ.. గిరిజన యూనివర్శిటీకి ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.
మహబూబాబాద్‌లో జరిగిన పోడు భూముల పట్టాల పంపిణీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరు, బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి రిపేర్ సెంటర్ మంజూరు చేయడం సరైంది కాదన్నారు. రైళ్లు తయారీ చేసే ఫ్యాక్టరీనీ గుజరాత్‌కు తరలించి.. రిపేర్ సెంటర్ కాజీపేటకు ఇవ్వడం వివక్షకు గురిచేయడమేనని మండిపడ్డారు. వీటన్నిటికీ జవాబు చెప్పిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చదవండి: గిరిజనులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఆ కేసులు రద్దు!
కాగా పోడు భూములకు పట్టాలు మాత్రమే కాకుండా.. రైతు బంధు, రైతు బీమా కూడా అందుతుందని కేటీఆర్ అన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా వర్తిస్తుందని చెప్పారు. జిల్లాలో 24,281 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment