సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నేటి నుంచి రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు, అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నిర్వహించేందుకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల లైవ్ కవరేజ్‌ను అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ నుంచి మీడియాకు ఇవ్వనున్నట్లు సమాచార శాఖ తెలిపింది.
టీడీపీ సీనియర్, ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభ్యులచేత ప్రమాణం చేయించనున్నారు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రొటెం స్పీకర్. స్పీకర్ ఎన్నికకు ఇవాళే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment