సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకటే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, అనకాపల్లి ఎంపీగానూ, పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు.
కాగా, ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment