
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడారు. నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్దానం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని అన్నారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమేనని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని, ఢిల్లీ నామినేట్ చేసీ ముఖ్యమంత్రి అని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారని అన్నారు. కలసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ అని అన్నారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మిడిసిపడుతోందని, ఇంత మిడిసిపాటు వద్దని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment