Updates..
రేపటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీలో కుల గణన తీర్మానం రేపటికి వాయిదా
- ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని భావించిన సర్కార్
- ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో రేపు సభలో కులగణన తీర్మానం
- రేపు ఉదయం 10 గంటలకు సభలో తీర్మానం పెట్టనున్న మంత్రి పొన్నం
- ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనున్న ప్రభుత్వం.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క... అసెంబ్లీలో బడ్జెట్‌పై రిప్లై
- రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గత ప్రభుత్వం
- జీఎస్‌డీపీకి అనుగుణంగానే 60వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో చూపించాము
- రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం
- 10 సంవత్సరాలు అధికారంలో ఉండి గ్రూప్ -1 వేయలేకపోయారు. ఎంత మంది తల్లులు కన్నీళ్లు పెట్టుకున్నారో మీకు తెలియదు
- టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేశాం. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం 40 కోట్ల రూపాయలు ఇచ్చాము. 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేయబోతున్నాము.
- ఎల్ బి స్టేడీయంలో 7వేల మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇచ్చాము
- సింగరేణిలో 441 మందికి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నియామక పత్రాలు ఇచ్చాము
- రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలు పెట్టాము. ఇది ఆరంభం మాత్రమే
- 13444 మందికి కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు ఎల్ బి స్టేడియంలో ఇచ్చాము
- ఆరు గ్యారంటీల హామీలకు కట్టుబడి ఉన్నాము. గాలికి వదిలేయలేదు
- వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ రూపాకల్పన చేసాము
- గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బడ్జెట్ తీసుకువచ్చింది
- ఆరు గ్యారెంటిలకు 53వేలు కేటాయించాము.. ఇందులో తప్పేముంది
- ప్రతీ సెగ్మెంట్ కు ఇందిరమ్మ 3వేల కు పైగా కట్టిస్తాము
- మహాలక్ష్మీ పథకం దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.
- గతంలో ఆదాయం లేకున్నా 20 శాతం పెంచుకుంటూపోయారు
- పెట్టిన లెక్కలు ఖర్చు అయ్యాయా లేదా అన్నది గత 10 ఏళ్లు పట్టించు కోలేదు
- 2014 నుంచి 2023 వరకు 14,87,834 కోట్లు ప్రవేశ పెట్టగా ఖర్చు చేసింది 12,25,326 కోట్లు మాత్రమే- 2,62,518 కోట్లు ఖర్చు పెట్టలేదు
- 2023-24 వార్షిక సంవత్సరం లో కూడ బడ్జెట్‌లో 70 వేల రూపాయల వ్యత్యాసం ఉంది
- బడ్జెట్‌లో నిధులు కేటాయించి రాబడి రాకుండ ఎత్తి వేయడం వల్ల పేదలు, బడుగు బలహీన వర్గాల కొరకు కేటాయించిన సంక్షేమ పథకాలకు కోత పడుతుంది
- ఆదాయం బాగున్న తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ లో పెట్టిన ఖర్చు 79 శాతం మాత్రమే ఉండటం దురద్రుష్టకరం
శాసన మండలి ప్రాంగణంలో.. ఎమ్మెల్సీ కవిత
- రాష్ట్ర ప్రభుత్వం నిన్న సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహానికి భూమి పూజ చేశారు
- గత ప్రభుత్వం అక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిచేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అనుకున్నం
- నిన్న సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి అధికారికంగా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు చేస్తామని చెప్పారు
- తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంలో మాకు అభ్యతరం లేదు
- ఎందుకంటే అమ్మ పేదగా ఉన్న గొప్పగా ఉన్న అమ్మనే
- అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాని వ్యతిరేకిస్తున్నాం
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
- మాకు రాజీవ్‌గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది
- దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల గౌరవం ఉంది
- జాతీయ నాయకుల పేర్లు అనేక వాటికి పెట్టుకున్నాం
- ఇప్పటికే ఎయిర్‌పోర్టు పెట్టుకున్నాం.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహన్నీ పెట్టాల్సిన చోట ఈ విగ్రహం పెట్టటం సరైనది కాదు
తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు
- పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారు
- కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారు
- ప్రభుత్వం ఇసుక అక్రమాలను అడ్డుకోలేకపోయింది
- ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు
- అధిక లోడ్‌లు వేసి ప్రజాధనానికి నష్టం చేశారు
- ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ లేదు
- అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగింది
- పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవు.
అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..
- కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్
- అస్తవ్యస్తంగా.. పనులు ప్రారంభించారు
- మహారాష్ట్రలో ముంపు సమస్య ఎత్తిచూపిన కాగ్
- డీపీఆర్‌లో 63,352 కోట్లు చూపించి.. 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారు.
- ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది.
- మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చు అవుతుంది.
- ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారు.
- ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపించారు.
- కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1,019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.
- ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు.
- 15 బ్యాంకులతో 87వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.
- బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉంది.
- రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసింది.
- ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 700 కోట్ల నుంచి 14వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
- రుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి.
- కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది.
- ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగింది
- కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డితో సహా 1,47,427 కోట్లకు పెరిగింది..
- ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ లేదు
- ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం
- కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయి
- రీఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారు
అసెంబ్లీలో ముగిసిన జీరో అవర్..
►జీవో 317పై ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.
►మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్లు వేయనున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు.
►అసెంబ్లీ సెక్రటరీ వద్ద నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్
►గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర
పంచాయతీరాజ్ శాఖపై కాగ్ రిపోర్ట్..
- కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- గత ప్రభుత్వ హయాంలో గ్రాంట్స్ మళ్ళింపు జరిగింది.
- నిధుల దుర్వినియోగం జరిగింది.
- బకాయిలు వసూలు చేయలేకపోయారు.
- కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారు.
- సకాలంలో రికార్డులు సమర్పించలేదు.
బీఆర్‌ఎస్ కోసం నా వంతు కృషి చేస్తా: వద్దిరాజు
- రాజ్యసభ బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్ర కీలక వ్యాఖ్యలు
- మరోసారి కేసీఆర్ నాకు అవకాశం ఇవ్వటం ఆనందంగా ఉంది
- బీసీ బిడ్డనైన నాకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు
- కృష్ణాజలాల వాటా కోసం రాజ్యసభలో నా గళం విప్పుతాను
- కెసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను.
- అలవి గాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను.
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
- ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నారు.
- ప్రజలచేత ఎన్నికైతేనే మేము ఎమ్మెల్యేలమయ్యాము.
- సమావేశాలకు మమ్మల్ని కూడా పిలవాలి అని కోరుతున్నాం.
- జీహెచ్‌ఎంసీలో నిధుల కొరత ఉంది.
- కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.
అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్
- అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దు
- అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దు
- బ్రేక్ టైం లేదా సభ వాయిదా తరువాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలి
- నిన్న ఈ అంశంపైనే బీఆర్‌ఎస్ ఆందోళన
- మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో.. అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన
- బీజేపీఎల్ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
► తెలంగాణ శాసన సభలో ప్రారంభమైన జీరో అవర్
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరో రోజు ప్రారంభం
- సభను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- ఇవాళ బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి
► నేడు(ఆరో రోజు) తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.
► నేడు అసెంబ్లీలో బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
► ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న సభ
► ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
► కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సభలో పెట్టనున్న ప్రభుత్వం
► ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీరాజ్ రిపోర్ట్‌లను టేబుల్ చేయనున్న ప్రభుత్వం
► అసెంబ్లీలో పలు ప్రకటనలు చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
మరోవైపు..
► నేటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది.
► తెలంగాణలో నేడు నామినేషన్ వేయనున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు.
► అటు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేయనున్నారు.
► నేడు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment