కేటీఆర్‌ Vs సీతక్క.. ఓయూకు ఎందుకు పోలేదు? | Heated Political Comments Between KTR And Seethakka In Assembly | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ Vs సీతక్క.. ఓయూకు ఎందుకు పోలేదు?

Published Wed, Jul 31 2024 11:19 AM | Last Updated on Wed, Jul 31 2024 12:12 PM

Heated Political Comments Between KTR And Seethakka In Assembly

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మంత్రి సీతక్క, మాజీ మంత్రి కేటీఆర్‌ మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇస్తే తాను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్‌ సవాల్‌ చేశారు.

సభలో ఉద్యోగాలపై కేటీఆర్‌ కామెంట్స్‌..

  • ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్‌ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారు.
  • ఇ‍ప్పటికే 34వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు.
  • బడ్జెట్‌ సమావేశాల్లో కూడా ఇదే చెప్పారు.
  • కాంగ్రెస్‌ నేతలకు ఇదే నేను సవాల్‌ చేస్తున్నారు.
  • మా ప్రభుత్వంలో ఇచ్చిన నియామకాలకు సంబంధించి కాకుండా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.
  • మా ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలను తాము ఇచ్చినట్టు చెప్పుకున్నారు.
  • నేను ఇప్పుడే సవాల్‌ చేస్తున్నారు.
  • సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి.. నేను ఇప్పుడు నిరుద్యోగుల వద్దకు పోదాం.
  • అశోక్‌ నగర్‌, సెంట్రల్‌ లైబ్రరీ, ఓయూకు వెళ్దాం.
  • ఈ కాంగ్రెస్‌ పాలనలో ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరుద్యోగులు చెబితే నేను అక్కడే రాజీనామా చేస్తాను.
  • ఏ ఒక్కరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పినా.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను.
  • ఇదే సమయంలో సీఎం రేవంత్‌, భట్టి విక్రమార్కకు లక్ష మందితో పౌర సన్మానం చేస్తాను అంటూ సవాల్‌ విసిరారు.
  • అలాగే, ఎన్నికల సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
  • ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.

కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్‌..

  • ఉద్యోగాల విషయంలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్‌..
  • అహనా పెళ్లాంటా అనే సినిమా అందరికీ గుర్తు ఉంటుంది. 
  • నటుడు కోటా శ్రీనివాస్‌ రావు కోడి కథ గుర్తుకు వస్తుంది. 
  • ఎన్నికల సమయంలో ఉద్యోగాలు అంటూ ఆశ పెట్టారు. 
  • ఎన్నికలు అయిపోగానే మళ్లీ దాని గురించి మాట్లాడరు. 
  • మళ్లీ ఎన్నికల అనగానే నోటిఫికేషన్లు అని ఊరించి ఉసూరుమనిపించారు. 
  • తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ మోసం చేసింది.
  • ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఇంటికో ఉద్యమం అన్నారు.
  • గత పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.
  • ఉద్యోగాలు ఇవ్వకలేపోగా బీఆర్‌ఎస్‌ నేతలు ఓయూకు వెళ్లేందుకు భయపడ్డారు.
  • 34వేల ఉద్యోగాలు పదేళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయారు.
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎన్నో పరీక్షల పేపర్లు లీకయ్యాయి.
  • పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది.
  • మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం.
  • తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement