సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటం, సెప్టెంబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు జరగనున్న ఈ చివరి అసెంబ్లీ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
చదవండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ..
Comments
Please login to add a commentAdd a comment