3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం | Telangana Assembly Sessions Day 1 Live Updates | Sakshi
Sakshi News home page

3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం

Published Thu, Aug 3 2023 10:16 AM | Last Updated on Thu, Aug 3 2023 1:07 PM

Telangana Assembly Sessions Day 1 Live Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతమైన ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశంలో ముందుగా కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటించారు. సాయన్నకు అసెంబ్లీలో నివాళి అర్పించారు. ఆయన మృతికి శాసన సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు.

సాయన్నతో ఎంతో సాన్నిహిత్యం: కేసీఆర్‌
సంతాప తీర్మానాన్ని కేసీఆర్‌ ప్రవేశ పెట్టగా.. సభ్యులు సాయన్న రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని అన్నారు. సాయన్నతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి సాయన్న.. నిత్యం ప్రజలతో మమేకమై నిరాడంబరంగా ఉండేవారని పేర్కొన్నారు.

సాయన్న లేని లోటు తీర్చలేనిదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆయన  ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని.. కంటోన్మెంట్‌ అభివృద్ధికి చేసిన కృషిని మరవలేమని గుర్తుచేసుకున్నారు. తరువాత ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క్‌, రఘునందన్‌ రావు తదితరులు సాయన్నను గుర్తుచూస్తూ కాసేపుమాట్లాడారు. అనంతరం తెలంగాణ శాసన సభ రేపటికి వాయిదా పడింది.

మూడు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలు
స్పీకర్‌ పోచారం అధ్యక్షతన బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం అయ్యింది. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి హాజరవ్వగా.. కాంగ్రెస్‌ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్, ఎంఐఎం నేత అక్భరుద్దిన్‌ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నేతలంతా చర్చించారు. 

కాగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది. శుక్రవారం వరదలపై అసెంబ్లీలో  చర్చించనున్నారు. వివిధ బిల్లులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే  పని దినాలు పొడిగించాలని, పది రోజులపాటు సభ నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. 

ఇక అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు దూరంగా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వనమా నిర్ణయం తీసుకోగా.. జలగం వెంకట్రావును ఇంకా ఎమ్మెల్యేగా పరిగణించని కారణంగా ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement