
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది.
ప్రతీ రోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు సిద్ధం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నూతన ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలిసింది.