సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల మాటల తూటాలతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో దూసుకెళ్తూ.. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చదవండి: గ్రేటర్ వార్ : ఉచితంగా తాగునీరు
అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉందన్న కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అడ్డు పెట్టుకొని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చదవండి: సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి
Comments
Please login to add a commentAdd a comment