రక్తచరిత్ర | Begins a series of events | Sakshi
Sakshi News home page

రక్తచరిత్ర

Published Sat, Jun 14 2014 1:43 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

రక్తచరిత్ర - Sakshi

రక్తచరిత్ర

మచిలీపట్నం క్రైం : వ్యక్తిగత విభేదాలు.. వివాహేతర సంబంధాలు.. సరిహద్దు వివాదాలు.. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. కారణాలు ఏమైనా పది రోజులుగా జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జిల్లా వాసులను వణికిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల నిఘా కొరవడటం వల్లే వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.  
 
అదుపుతప్పుతున్న శాంతిభద్రతలు!
 
ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు శాఖ ఇటీవల ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నుంచి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించి అందరి అభినందలు అందుకున్న జిల్లా పోలీసులు ఇటీవల తమ పట్టు సడలించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
పోలీసుల నిఘా లోపం వల్లే వరుసగా హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
వ్యక్తిగత విభేదాలతోనే ఎక్కువ
 
జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలు, హత్యాయత్నాలు వ్యక్తిగత కారణాలు, వివాహేతర సంబంధాలకు సంబంధించినవే అధికం. పోలీసులకు ఫిర్యాదులు అందిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగితే అప్పుడు పోలీసుల వైఫల్యం అవుతుంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు సంబంధించిన కేసుల్లోని నేరస్తులను దాదాపు అరెస్ట్‌చేశాం. మిగిలిన ఒకటి, రెండు కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సి ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం.
 - జె.ప్రభాకరరావు, ఎస్పీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement