extramarital relations
-
రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో మూడో భర్తతో పరారైంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తేని జిల్లా కూడలూరుకు చెందిన విజయ్‌బోస్ (32) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. విద్య (30) ను 2014లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగ నిమిత్తం భర్త మరో ఊరిలో ఉండేవాడు. కుమారుడి ఆలనాపాలన చూడకుండా విద్య అధిక సమయం సెల్ఫోన్లో గడుపుతుండేది. ఈ క్రమంలో కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న విజయ్‌బోస్ ఇంటికి వచ్చి భార్యను మందలించాడు. మాట వినకపోవడంతో భార్య తరఫు బంధువులకు ఫిర్యాదు చేయగా విద్యకు గతంలో పెళ్లయినట్లు, విజయ్‌బోస్ రెండోభర్త అనే విషయం బయటపడింది. దీంతో, ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కుమారుడిని భర్త వద్దే వదిలేసి విద్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎలాగోలా నచ్చజెప్పి భార్యను కాపురానికి తీసుకురావాలని విజయ్‌బోస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడా ది మేలో మురళి అనే వ్యక్తిని విద్య మూడో వివాహం చేసుకుంది. ఈ పరిణామంతో మరింత ఖంగుతిన్న విజయ్‌బోస్ తన అత్తింటివారిని నిలదీయగా, వరకట్న వేధింపుల కేసు పెడతాం అని బెదిరించారు. మహిళా పోలీస్ స్టేషన్లో విజయ్‌బోస్ ఫిర్యాదు చేయడంతో విద్య, ఆమె తండ్రి సుకుమారన్, తల్లి చిత్ర, తమ్ముడు శరణ్‌కుమార్, తాజా భర్త మురళి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రక్తచరిత్ర
మచిలీపట్నం క్రైం : వ్యక్తిగత విభేదాలు.. వివాహేతర సంబంధాలు.. సరిహద్దు వివాదాలు.. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. కారణాలు ఏమైనా పది రోజులుగా జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జిల్లా వాసులను వణికిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల నిఘా కొరవడటం వల్లే వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అదుపుతప్పుతున్న శాంతిభద్రతలు! ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు శాఖ ఇటీవల ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నుంచి ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించి అందరి అభినందలు అందుకున్న జిల్లా పోలీసులు ఇటీవల తమ పట్టు సడలించారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా లోపం వల్లే వరుసగా హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విభేదాలతోనే ఎక్కువ జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలు, హత్యాయత్నాలు వ్యక్తిగత కారణాలు, వివాహేతర సంబంధాలకు సంబంధించినవే అధికం. పోలీసులకు ఫిర్యాదులు అందిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరిగితే అప్పుడు పోలీసుల వైఫల్యం అవుతుంది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు సంబంధించిన కేసుల్లోని నేరస్తులను దాదాపు అరెస్ట్‌చేశాం. మిగిలిన ఒకటి, రెండు కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సి ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. - జె.ప్రభాకరరావు, ఎస్పీ