రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి.. | Wife Absconded With Third Husband At Tamil Nadu | Sakshi
Sakshi News home page

రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..

Published Sat, Jul 2 2022 7:13 AM | Last Updated on Sat, Jul 2 2022 7:13 AM

Wife Absconded With Third Husband At Tamil Nadu - Sakshi

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో మూడో భర్తతో పరారైంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. రెండో భర్త ఇచ్చిన ఫిర్యాదుతో మూడో భర్తతో పరారైంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తేని జిల్లా కూడలూరుకు చెందిన విజయ్‌బోస్‌ (32) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. విద్య (30) ను 2014లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగ నిమిత్తం భర్త మరో ఊరిలో ఉండేవాడు. కుమారుడి ఆలనాపాలన చూడకుండా విద్య అధిక సమయం సెల్‌ఫోన్‌లో గడుపుతుండేది. ఈ క్రమంలో కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న విజయ్‌బోస్‌ ఇంటికి వచ్చి భార్యను మందలించాడు. మాట వినకపోవడంతో భార్య తరఫు బంధువులకు ఫిర్యాదు చేయగా విద్యకు గతంలో పెళ్లయినట్లు, విజయ్‌బోస్‌ రెండోభర్త అనే విషయం బయటపడింది.

దీంతో, ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కుమారుడిని భర్త వద్దే వదిలేసి విద్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎలాగోలా నచ్చజెప్పి భార్యను కాపురానికి తీసుకురావాలని విజయ్‌బోస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడా ది మేలో మురళి అనే వ్యక్తిని విద్య మూడో వివాహం చేసుకుంది. ఈ పరిణామంతో మరింత ఖంగుతిన్న విజయ్‌బోస్‌ తన అత్తింటివారిని నిలదీయగా, వరకట్న వేధింపుల కేసు పెడతాం అని బెదిరించారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌లో విజయ్‌బోస్‌ ఫిర్యాదు చేయడంతో విద్య, ఆమె తండ్రి సుకుమారన్, తల్లి చిత్ర, తమ్ముడు శరణ్‌కుమార్, తాజా భర్త మురళి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement