నిందితుల ఇళ్ల పరిశీలన
నిందితుల ఇళ్ల పరిశీలన
Published Fri, May 26 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
కృష్ణగిరి: పత్తికొండ నిమోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో కొందరి నిందితుల ఇళ్లను పోలీసులు పరిశీలించారు. జంట హత్యకేసులో 12 మందిపై కేసు నమోదు కాగా, ఆరుగరు తొగర్చేడు గ్రామస్తులు ఈ మేరకు తొగర్చేడు గ్రామాన్ని శుక్రవారం డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్‌ఐ సోమ్లానాయక్‌లు సందర్శించారు. ఈ హత్య కేసులో నిందితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలోకి ఎవరైన కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారమందించాలని ప్రజలకు సూచించారు.
Advertisement
Advertisement