
ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ
న్యూఢిల్లీ : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు సహా తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.
హైకోర్టు విభజనపై ప్రధానమంత్రితో చర్చించలేదని ఆయన తెలిపారు. జల వివాదాలపై తాను జోక్యం చేసుకోనని, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆ అంశంపై మాట్లాడనని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కృష్ణా పుష్కరాల పనులు సకాలంలో పూర్తవుతాయని ఆయన తెలిపారు.