సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంకల్పించిన తర్వాత మోదీని కలవడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఏడు జోన్ల వ్యవస్థను త్వరగా అమోదించాలని వినతిపత్రం అందజేయనున్నారు. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లు వంటి అంశాలపై రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛనివ్వాలని ఆయన కోరనున్నట్టు తెలుస్తోంది. నూతన సచివాలయ నిర్మాణానికి కంటోన్మెంట్ స్థలం ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. గురువారం మధ్యాహ్నమే ఢిల్లీకి వచ్చిన కేసీఆర్, నీతిఅయోగ్ నిర్వహించే ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా హాజరవుతారని సమాచారం.
హోం మంత్రితో ముగిసిన గవర్నర్ సమావేశం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో శుక్రవారం సమావేశయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది సాధారణ సమావేశమని అన్నారు. గవర్నర్ల కాన్ఫరెన్స్ ఫాలో అప్‌లో భాగంలో హోం మంత్రిని కలసినట్టు వెల్లడించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment