వచ్చే సార్వత్రికఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామాని కి ఒక కానిస్టేబుల్ చొప్పున కేటాయిస్తున్నామని, గ్రామాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంతోపాటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ వెల్లడించారు.
ఆత్మకూర్, న్యూస్‌లైన్: వచ్చే సార్వత్రికఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామాని కి ఒక కానిస్టేబుల్ చొప్పున కేటాయిస్తున్నామని, గ్రామాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంతోపాటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నామని చెప్పారు. గురువారం ఆయన ఆత్మకూర్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..బూత్‌లెవల్‌లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అన్నారు.
జిల్లాలో ఏఎస్‌ఐ పోస్టులు ఖాళీ ఉన్నాయని, త్వరలోనే వాటిని భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని సర్కిల్‌ప్రాంతాల్లోని మండలాల్లో 30మంది చొప్పున 450 మంది కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు. మరో 150 ఖాళీలను త్వరలోనే భర్తీచేస్తామన్నారు. రూ. 80లక్షలతో జిల్లాలోని ఆరుచోట్ల పోలీస్‌భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పం పించామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.
జిల్లాలోని ఉప్పనుంతల, ఈగలపెంట, పోలీస్‌స్టేషన్ భవనాలను గతంలో మావోయిస్టులు కూల్చివేశారని, దీంతోపాటు కేశంపేట, జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్, అయిజ, పోలీస్‌స్టేషన్ల భవనాలు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామని వివరిం చారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజ లు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. సమావేశంలో గద్వాల డీఎస్పీ గోవింద్‌రెడ్డితోపాటు ఎస్‌ఐ షేక్‌గౌస్, సిబ్బంది పాల్గొన్నారు.