రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతలు కీలకమైనప్పటికీ ఐపీఎస్‌ల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోం ది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతలు కీలకమైనప్పటికీ ఐపీఎస్‌ల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోం ది. పోలీసుశాఖలో ఎస్పీ, డీఐజీ పోస్టుల భర్తీకి తాత్సారం చేయడం విమర్శలకు తావిస్తోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు గతనెల మొదటి వారంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. అప్పుడు పోస్టింగ్ ఇవ్వకుండా కొందరు ఎస్పీ, డీఐజీలను వెయిటింగ్‌లో ఉంచి నెలన్నర దాటింది. వారిని తాత్కాలికంగా ఏదో ఒక విభాగానికి అటాచ్ చేసి వదిలేశారు. గుంటూరు అర్బన్ నుంచి బదిలీ అయిన ఎస్పీ ఆకె రవికృష్ణ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసి వెయిటింగ్‌లో ఉన్నారు.
కర్నూలు జిల్లా ఎస్పీ చంద్రశేఖరరెడ్డిని బదిలీచేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన్ను తాత్కాలికంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నార్త్‌జోన్ డీసీపీ శ్రీకాంత్ ఐక్యరాజ్యసమితి శాంతిదళానికి ఎంపికవడంతో ఆయన్ను బదిలీ చేశారు. కానీ ఐరాస నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. దీంతో ఆయన్ను నగర ట్రాఫిక్ విభాగం డీసీపీగా తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. ఆయన వెళ్లితే ట్రాఫిక్ విభాగం డీసీపీ పోస్టు ఖాళీకానుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 3 డీసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాదాపూర్, బాలానగర్, అల్వాల్ డీసీపీ పోస్టులకు ఎస్పీ స్థాయి అధికారుల్ని నియమించాల్సి ఉంది.
మరో ఇద్దరు డీఐజీలు, ఒక ఐజీ కూడా పోస్టింగ్‌కోసం ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ డీఐజీగా నియమితులైన గంగాధర్‌ను సొంత జిల్లా కారణంగా ఈసీ ఆదేశాలతో బదిలీ చేశారు. ప్రస్తుతం వెయిటిం గ్‌లో ఉన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ పోస్టు నుంచి బదిలీ అయిన సూర్యప్రకాశరావుపై ఆరోపణలొచ్చినందున భద్రాచలం ఓఎస్‌డీగా తాత్కాలికంగా పంపారు. నక్సల్ నిరోధక కార్యకలాపాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఆ బాధ్యతలకు ఓఎస్‌డీగా అదనపు ఎస్పీ స్థాయి అధికారుల్ని నియమించే సంప్రదాయముంది. తదుపరి ఐపీఎస్‌ల బదిలీలప్పుడు సూర్యప్రకాశరావుకు డీఐజీ పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొందిన వీవీ శ్రీనివాసరావుకూ పోస్టింగివ్వడంలో ఆల స్యమైంది.
పోలీసుశాఖలో కీలకమైన 2 అదనపు డీజీ స్థాయి పోస్టుల నియామకాల్లోనూ ప్రభుత్వం జాప్యంచేస్తోంది. ప్రిం టింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ ఆర్పీ మీనా గతనెల్లో పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. తూనికలు, కొలతలశాఖ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. తూనికలు కొలతల శాఖకు ఐజీ లేదా అదనపు డీజీని నియమించాల్సిఉంది. అదనపు డీజీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన జేవీ రాముడు ప్రస్తుతం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు సంయుక్తంగా ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. ఆయన్ను డీజీ స్థాయి పోస్టుకు బదిలీచేసే అవకాశముంది. ఆయనతోపాటు డీజీపీగా పదోన్నతి పొందిన ఏకేఖాన్ మాత్రం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగానే కొనసాగుతారని తెలిసింది.