న్యూఢిల్లీ: తిరుపతి, వైజాగ్, విజయవాడ ఎయిర్పోర్ట్లలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దీని ద్వారా ఏపీ పర్యాటానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో మంత్రి యనమల విలేకర్లతో మాట్లాడుతూ... రుణమాఫీకి కేటాయించిన రూ. 5 వేల కోట్లు సరిపోవని తెలిపారు.
ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు స్వర్ణాంధ్రకు పునాది అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యుత్, వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని అన్నారు. సెప్టెంబర్ 30 నాటికి అధికారుల బదిలీ పూర్తి కావాలని యనమల తెలిపారు.