
మఠంపల్లి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్ నాయకులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఈనెల 13న స్థానిక సేవాలాల్ జాతరలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిలో ఇళ్లు ధ్వంసమై, తీవ్రంగా గాయపడిన బాధిత కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఎంపీ సంతోష్ ద్వారా డీజీపీకి ఆదేశాలిప్పిస్తూ, పోలీసు అధికారులను అనుకూలమైన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment