గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు సహా తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానితో సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.