నెల్లూరు: నెల్లూరు నగరంలో శాంతి భధ్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించాలని ఎస్పీ విశాల్‌గున్నీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత ప్రాంతంలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో నగర డీఎస్పీ జి.వి.రాముడుతో కలిసి నగర పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, తీసుకొంటున్న చర్యలపై చర్చించారు. అసాంఘీక శక్తులు, ఆకతాయిలపై కఠినంగా వ్యవహరించాలని, నేరాల నియంత్రణకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్‌పై అసహనం..?
ఈక్రమంలోనే బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రామారావు వ్యవహారశైలిపై ఎస్పీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల రామారావు వ్యవహారశైలిపై పలు ఆరోపణలు వెల్తువెతిన్న విషయం తెలిసిందే. ఇన్‌స్పెక్టర్ సిబ్బంది నడుమ పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. ఈవిషయాలన్నీ ఎస్పీ దృష్టికి వెళ్లాయి. దీంతో ఆరోపణలకు దూరంగా ఉంటూ సిబ్బందిని సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలని ఎస్పీ ఆయన్ను ఆదేశించినట్లు సమాచారం.
శాంతి భద్రతలను పరిరక్షించండి : ఎస్పీ
Published Wed, May 25 2016 10:27 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement