రేవంత్ రెడ్డి అనే జోకర్‌.. కేటీఆర్‌ షాకింగ్‌ ట్వీట్‌ | Ktr Tweet On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డి అనే జోకర్‌.. కేటీఆర్‌ షాకింగ్‌ ట్వీట్‌

May 24 2024 11:37 AM | Updated on May 24 2024 3:15 PM

Ktr Tweet On Cm Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.

‘‘నా బంధువుకు వెయ్యి కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్లు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి’’ అంటూ దుయ్యబట్టారు.

సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ అయిన సీఎం రేవంత్ రెడ్డినీ జైల్లో ఎందుకు పెట్టకూడదు?’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

 

‘‘నేను రాను బిడ్డో  సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుంచి పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చినం!’’ అంటూ కేటీఆర్‌ మరో ట్వీట్‌ చేశారు. 

‘‘జననం నుండి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తెచ్చినం. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులు.. నగరం నలుమూలలా నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు. ఒకటా? రెండా?. కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవం’’ అని కేటీఆర్‌ ఎక్స్‌(ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. 

రేవంత్ ఓ జోకర్

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement