సాక్షి, హైదరాబాద్: రేవంత్ సర్కార్ పాలనా వైఫల్యాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి ఎత్తి చూపారు. తెలంగాణాలో పింఛన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?. ఠంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?’’ అంటూ ప్రశ్నస్త్రాలు సంధించారు.
‘‘మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి... కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?. మందుబిళ్లల కోసం కొడుకులు , కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే 'మార్పు' వస్తుందని ఎవరనుకున్నారు?’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో.. ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు?. మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు?’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ఇట్లా అవునని ఎవరనుకున్నారు?
తెలంగాణాలో ఫించన్ల కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు?
టంచన్ గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు?
మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి...
కనికరం లేకుండా వృద్దుల పెన్షన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు?… pic.twitter.com/hDQKbjOSrR— KTR (@KTRBRS) November 27, 2024
Comments
Please login to add a commentAdd a comment