సాక్షి సిద్దిపేట: గోదావరి నీటితో తెలంగాణ వ్యాప్తంగా చెరువులు నింపి అలుగులు పారిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకు కళ్లు కనపడటం లేవా అని ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదనడం సిగ్గుచేటని అన్నారు. ఆయన దుబ్బాకకు మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న దుబ్బాక ప్రాంతానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సాగు, తాగునీరు అందడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా దుబ్బాకకు సాగునీరు వచ్చిందని పేర్కొన్నారు. కెనాల్ ప్యాకేజీ 12 ద్వారా లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment