బరాజ్‌లను పరిశీలించిన ఈఎన్‌సీ జనరల్ అనీల్‌కుమార్ బృందం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్ గుండా ఖరీఫ్ సీజన్‌లో నీటిని ఎగువకు తరలించడానికి రాష్ట్ర ఇరిగేషన్ సాంకేతిక ఉన్నతాధికారుల బృందం శనివారం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈఎన్‌సీ జనరల్ గుమ్మడి అనిల్‌కుమార్ బృందంతోపాటు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజెషన్ (సీడీఓ) మోహన్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణల బృందాలు, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి మేడిగడ్డ (లక్ష్మి) అన్నారం (సరస్వతీ) బరాజ్‌లను పరిశీలించారు.
ముందుగా అన్నారంలో చేపట్టిన సీపేజీ మరమ్మతు లను పరిశీలించిన అనిల్‌కుమార్.. వాటిని త్వరగా పూర్తిచే యాలని ఆదేశించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ ద్వారా నీటిని తరలించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న 11 మోటార్ల టెస్ట్ రన్‌లు, రిపేర్లు పూర్తిచేసి సిద్ధంగా ఉంచినట్లు అధికారు లకు ఆయనకు చెప్పారని సమాచారం. అదేకాకుండా అన్నా రం బరాజ్ పెద్దవాగు, మానేరు వాగులతోపాటు చిన్నచిన్న వాగుల ద్వారా నీటిలభ్యత ఉందని ఇంజనీర్లు ఈఎన్‌సీతో పేర్కొన్నారు.
ఇప్పటికే అన్నారం బరాజ్‌లో ఉన్న మొత్తం 66 గేట్లను మూసి ఉంచారు. నీటి తరలింపు అంశంపై పరిశీలన చేయాలని ఇంజనీర్లను ఆయా బృందాలు ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఎగువ నుంచి ప్రాణహిత ద్వారా 20 వేల క్యూసెక్కులకుపైగా నీరు వస్తోంది. ఉన్నతాధికారుల బృందం వెంట ఎస్‌ఈ కరుణాకర్, ఈఈలు యాదగిరి, తిరుపతిరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment