సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ప్రచారం చేసుకుంటోంది. అధికార బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో వెరైటీ కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న హస్తం.. ఇప్పుడు ఆ ఆరోపణలనూ ప్రచారానికి వాడుకుంటోంది.
తాజాగా.. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించి ప్రచారంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫొటోతో కూడిన కాళేశ్వరం ఏటీఎంను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.
ఆ ఏటీఎంలపై కాళేశ్వరం కరప్షన్ రావు( KCR) పేరుతో వినూత్నంగా కేసీఆర్ ఫొటోను.. కాళేశ్వరం కరప్షన్ రాకెట్ బ్యాంక్.. అలాగే కేసీఆర్ పేరుతో లక్ష కోట్ల నోటును రిలీజ్ చేసింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అంటూ ఏటీఎంపై పేర్కొంది కాంగ్రెస్.
Comments
Please login to add a commentAdd a comment