కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదారిలో పడింది
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం త ప్పుదారిలో పడింది. ఈ ని ర్ణయం వల్ల కాంగ్రెస్‌కే నష్టం జరుగుతుంది. పనికిరాని ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం సరికాదు’అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజకీయంగా చూస్తే ఎన్నికల వరకే కొట్లాటలు ఉంటాయని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పరిధిలోని జంట జలాశయాల పరిరక్షణకు సంబంధించి గత ప్ర భుత్వం జీఓ 111 రద్దు చేసినా, దాని కంటే కూడా నిరర్థకమైన జీఓ 69ను కొత్తగా తీసుకొచ్చిందని విమర్శించారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధి కూడా జరగాలంటే ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్ ఏరియా’గా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో విషం నింపిందని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని, దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ వేవ్‌తోనే తాను చేవెళ్లలో పెద్ద మెజారిటీతో గెలుపొందానని చెప్పారు. కేంద్ర కేబినెట్‌లో మీకు పదవి ల భించనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు విశ్వేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ ‘కేంద్రమంత్రి అయితే నాకు రాజకీయంగా నష్టం. దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బాధ్యతల కారణంగా చేవెళ్ల ప్రజలకు దూరం అవుతా. కానీ నాకున్న పరిజ్ఞానం దేశం మేలు కోసం ఉపయోగించాలని ఉంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment