
గడ్చిరోలి: మహారాష్ట్ర - చత్తీస్‌గడ్ సరిహద్దులోని ఇంద్రావతి నది పరిసరాల్లో భద్రతాదళాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతమైన కాళేశ్వరం, మహదేవ్‌పూర్‌లలో పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
కాగా వరుస ఎన్‌కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంద్రావతి నదిలో లభ్యమైన మృతదేహాలను మొసళ్లు పీక్కుతిన్నాయి. దీంతో మృతదేహాల గుర్తింపు కష్టమని అధికారులు అంటున్నారు. మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. తాజాగా ఎన్‌కౌంటర్‌లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment