గడ్చిరోలి: రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చిన ఘటనలో ముగ్గురు పోలీస్ కమాండోలు మృతి చెందారు. మహరాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించేందుకు వెళ్లిన జవాన్లు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు బలైయ్యారు.ఈ ఘటనలో సీ-60 విభాగానికి చెందిన జవాన్లు మృతి చెందినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు.
మందుపాతరను పేల్చిన అనంతరం జవాన్లు కూడా కాల్పులకు దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ఇదే అతిపెద్ద దాడిగా పోలీసులు తెలిపారు.