
మైనర్‌పై సామూహిక అత్యాచారం
గడ్చిరోలి: జిల్లాలోని ఎల్షిల్ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎల్షిల్‌కు చెందిన 12 యేళ్ల బాలిక పండ్లు అమ్ముకునేందుకు శనివారం అల్లాపల్లి వెళ్లింది. సాయంత్రం వరకు పండ్ల అమ్మిన తర్వాత ఆమె బస్టాండ్‌కు వచ్చేసరికి బస్సు వెళ్లిపోవడంతో తన గ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తోంది.
కాగా, బైక్‌పై వచ్చిన బాలికతో బాగా పరిచయమున్న కిషోర్ మండల్(23), ప్రదీప్ బిష్వాస్(22) అనే ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి తీసుకెళ్లి సమీప అటవీప్రాంతంలో అత్యాచారానికి ఒడిగట్టారు. తప్పించుకుని వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అహెరీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కిషోర్ మండల్‌ను అరెస్టు చేసి, రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు.