శునకాలకు ఘనంగా వివాహం
అనంతపురం: వరుణుడి కరుణ కోసం అనంతపురం జిల్లావాసుల బుధవారం శునకాలకు ఘనంగా వివాహం జరిపించారు. జిల్లాలోని ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో సవృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామస్తులంతా కలిసి శునకాల వివాహం జరిపించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ వాటిని ఉరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులందరూ కలిసి పెళ్లి భోజనాలు చేశారు.
ఇది అనాది కాలంగా వస్తున్న ఆచారమని ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి, కరువు కాటకాలు దరి చేరవని గ్రామస్తులు తెలిపారు. ప్రధానంగా ఈసారి ఖరీఫ్ ప్రారంభమై 45 రోజులు అయినా ఇంతవరకూ చినుకు పడలేదని, దీంతో వరుణ దేవుడిని ఈ విధంగా కుక్కలకు పెళ్లి జరిపించి, వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశామన్నారు. తమ మొర ఆలకించి వరుణదేవుడు వర్షాలు కురిపించాలని ఆ దేవుడిని కోరుకున్నామని తెలిపారు. మరోవైపు కుక్కల పెళ్లితో గ్రామంలో సందడి నెలకొంది.