Allu Arjun Pushpa Movie: Samantha Respond Trolls On Her Special Song - Sakshi
Sakshi News home page

Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్‌ సాంగ్‌ ట్రోల్స్‌పై స్పందించిన సామ్‌

Published Mon, Dec 20 2021 10:58 AM | Last Updated on Tue, Dec 21 2021 11:12 AM

Samantha Respond Trolls On Her Special Song In Pushpa Movie - Sakshi

Samantha Response On Trolls On Her Pushpa Movie Special Song: అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీ డిసెంబర్‌ 17న విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి పుష్ప అత్యంత క్రేజ్‌ను సంతరించుకుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన వచ్చింది. ఇక ఈ మూవీలో స్టార్‌ హీరోయిన్‌ సమంత చేసిన స్పెషల్‌ సాంగ్‌ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సాగే ఈ పాటకు ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. ‘మీ మగ బుద్ది వంకర బుద్ధి’ అనే లిరిక్స్‌పై వివాదం చెలరేగింది.

చదవండి: ప్రముఖ టాలీవుడ్‌ నటి హంసానందినికి క్యాన్సర్‌

ఇక ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పురుషుల సంఘంతో పాటు తమినాడు పురుషు సంఘం కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇలా యూట్యూబ్‌లో ఓ వైపు రికార్డు స్థాయిలో వ్యూస్‌ రాబుడుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోయిన ఈ సాంగ్‌ను మరో వైపు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ పాటపై వస్తున్న వ్యతిరేకతపై ఇప్పటికే బన్నీ, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌లు స్పందించగా ఇప్పటి వరకు సమంత పెదవి కూడా విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా పుష్ప స్పెషల్‌ సాంగ్‌పై సామ్‌ స్పందించింది. పుష్ప మూవీ సక్సెస్‌ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సమంత తన స్పెషల్‌ సాంగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: సర్‌ప్రైజింగ్‌: రెండు నెలల్లోనే బిగ్‌బాస్‌ 6 తెలుగు సీజన్‌

పుష్పలో తను భాగమైనందకు చాలా సంతోషంగా ఉందని, ఈ స్పెషల్‌ సాంగ్‌ తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని తెలిపింది. అంతేగాక ఈ పాటలో డ్యాన్స్‌, బన్నీకి సమానంగా స్టేప్పులు వేయడం ఇలా ప్రతిథి తనకు చాలా ఎక్జయిటింగ్‌గా అనిపించింది అని పేర్కొంది. అంతేగాక ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్‌, ఆడియన్స స్పందన చ్తూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ షాకింగ్‌ కామెంట్‌ ఇచ్చింది. ఇది ఓ మ్యాడ్‌నెస్‌ అంటూ వ్యాఖ్యానించింది. అలాగే సోషల్‌ మీడియాలో ఈ పాటపై వస్తున్న ఫన్నీ వీడియోస్‌పై సమంత తన ట్విట్టర్ వేదికగా స్పందించింది. కొందరు యువకులు ఈ పాటను షార్ట్ వీడియోగా తీసి ఎగ్జామ్స్ ఉన్నాయ్ కదరా.. అంటే ఎగ్జామ్‌లో ఊ అంటావా.. ఊహు అంటావా మావా అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందిరా అంటూ ట్రోల్ చేశారు.  వీడియోను సామ్‌ నవ్వుతున్న ఎమోజీలను జత చేసి రీట్వీట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement