రంగస్థలం లాంటి క్లాసిక్ హిట్ తరువాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఈ మూవీని యాక్షన్ ఓరియెంటడ్‌గా తెరకెక్కించనున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోందట. ఈ ప్రత్యేక గీతంలో రకుల్ ప్రీత్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే బ్రూస్‌లీ, ధ్రువ సినిమాలతో అభిమానుల్ని మెప్పించిన ఈ జంట మరోసారి ప్రత్యేకగీతంలో చిందులు వేసే అవకాశం ఉందన్న మాట. ఈ సినిమాలో స్నేహ, తమిళ్ ఫేం ప్రశాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీకి జోడిగా కైరా అద్వానీ నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment