ఆ ఇద్దరితో మూడోసారి..! | Rakul Preeth to team up with Ram Charan for the third time | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితో మూడోసారి..!

Published Sat, Nov 25 2017 12:35 PM | Last Updated on Sat, Nov 25 2017 2:58 PM

Rakul Preeth to team up with Ram Charan for the third time - Sakshi - Sakshi

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుందట. ఇప్పటికే బ్రూస్ లీ, ధృవ సినిమాల్లో చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన రకుల్ ముచ్చటగా మూడో సారి జోడి కట్టేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా రకుల్ కు బోయపాటి దర్శకత్వంలో కూడా మూడో సినిమా కావటం విశేషం. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన సరైనోడు, జయ జానకీ నాయక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రకుల్ వరుసగా మూడోసారి బోయపాటి సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement