చెర్రీకి నో చెప్పిన రకుల్‌! | Rakul Preet Says No To Ram Charan And Boyapati New Movie Item Song | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 26 2018 1:26 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul Preet Says No To Ram Charan And Boyapati New Movie Item Song - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తరువాత చెర్రీ నుంచి రాబోతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికి వరకు ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను కూడా ​ప్రకటించకపోవడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ మూవీని బోయపాటి స్టైల్లో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. అయితే దేవి స్టైల్లో ఓ ఐటెంసాంగ్‌ను కూడా కంపోజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ ప్రత్యేకగీతంలో రకుల్‌ను తీసుకోవాలని చిత్రయూనిట్‌ భావించిందట. కానీ రకుల్‌ మాత్రం కూల్‌గా నో చెప్పేసిందని టాక్‌. అయితే ఇప్పటికే వీరిద్దరు బ్రూస్‌లీ, ధృవ సినిమాల్లో కలిసి నటించారు. తెలుగులో అవకాశాలు లేక కోలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ తిరుగుతున్న రకుల్‌.. ఈ ఐటమ్‌సాంగ్‌ను వద్దనడంతో ఈ పాటకు ఓ బాలీవుడ్‌ భామను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. స్నేహ, జీన్స్‌ ఫేం ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement