
రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ స్టైలిష్ లుక్‌లో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
బోయపాటికి తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ చేయించటం లో సెంటిమెంట్. అదే సెంటిమెంట్‌ను చరణ్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందట. బోయపాటి గత చిత్రం జయ జానకీ నాయక లో హీరోయిన్‌గా నటించిన రకుల్ చెర్రీతో ధృవ, బ్రూస్‌లీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌లో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment