Sai Pallavi Interesting Comments On Item Songs: హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తోంది ఈ నాచులర్ బ్యూటీ. మొదటి నుంచి నటిగా తనకంటూ కొన్ని పరిమితులను పెట్టుకున్న సాయి పల్లవి గ్లామర్ షో, ఎక్స్‌పోజింగ్‌కు దూరమనే సంగతి తెలిసిందే. అంతేకాదు పాత్ర నచ్చితేనే ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల శ్యామ్ సింగరాయ్ మూవీతో హిట్ కొట్టింది.
చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్!
ఇక త్వరలోనే విరాట పర్యం చిత్రంతో ఫ్యాన్స్‌ను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఐటెం, స్పెషల్ సాంగ్‌లపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. పుష్ప మూవీలోని ‘ఊ అంటావా మావ’, రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ వంటి తరహా పాటల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని హోస్ట్ అడగ్గా.. ఖచ్చితంగా చేయను అని మరు క్షణమే బదులిచ్చింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. ‘ఐటెం సాంగ్స్ నాకు కంఫర్ట్‌గా ఉండవు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాటిలో నటించే అవకాశం వచ్చినా చేయనని చేప్తాను.
చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి
ఎందుకంటే వస్త్రధారణ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. అందుకే స్పెషల్ సాంగ్‌లో నటించలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రేమపై తన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. రెండింటిలో ఏది లేకపోయిన జీవితం సంపూర్ణం కాదు’ అని సమాధానం ఇచ్చింది సాయి పల్లవి. చివరగా శ్యామ్ సింగరాయ్‌లో కనిపించిన సాయి పల్లవి ఇప్పటి వరకు ఎలాంటి సినిమాకు సంతకం చేయలేదని తెలుస్తోంది. ఇక రానాతో ఆమె నటించిన విరాట పర్వం జూలై 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment