
Samantha Pushpa Movie Special Song Release Date Fix: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ మొదలు కాగా సోమవారంతో పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సాంగ్‌పై పుష్ప టీం అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ 10న ఈ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందంప్రకటించింది. లంగా జాకెట్ ధరించి, మాస్ లుక్‌తో బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తున్న సమంత ఫోటోను ఇప్పటికే విడుదల చేసిన మూవీ యూనిట్ ఈ సందర్భంగా సమంత ఫుల్‌లుక్‌ను విడుదల చేసింది.
చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా!
కాగ ఆఈ స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మ్యూజిక్‌కి బన్నీతో సమంత ఇరగదీసే స్టెప్పులేసిందని సమాచారం. ‘ఉ అంటావా.. ఊ అంటావా’ అంటూ ఈ పాట సాగునుందని తెలుస్తోంది. ఇప్పటివరకు కెరీర్‌లో ఒక్కసారి కూడా స్పెషల్ సాంగ్స్ చేయని సామ్ మొదటిసారిగా బన్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసింది. దీంతో పుష్ప సినిమాకు సమంత, ఈ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
This winter is going to get heated up with @Samanthaprabhu2's moves 🔥🔥
— Pushpa (@PushpaMovie) December 8, 2021
'Sizzling Song of The Year' on 10th DEC 💥💥#PushpaTheRise#PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/KL0d6L10ya
Comments
Please login to add a commentAdd a comment