
కరోనా నియంత్రణలో భాగంగా విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుధ్య కార్మికులకు యావత్ దేశం ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతుంది. ఇప్పటికే సెలబ్రిటీలు వారి సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఇక గాయకులు, సంగీత దర్శకులు మరో ముందడుగేసి వారిపై తమకున్న గౌరవంతో పాటలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పోలీసులను కీర్తిస్తూ రఘు కుంచె ‘సలాం నీకు పోలీసన్నా’పేరిట ఓ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ‘జయహో పోలీస్’ అనే మరో పాటను విడుదల చేశారు. శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించగా ట్యూన్ కట్టి, స్యయంగా పాడారు కోటి. కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, భయాన్ని పారద్రోలేందుకు సంగీత దర్శకుడు కోటి ఇదివరకే ఓ పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
చదవండి:
సలాం నీకు పోలీసన్నా..
నా రామ్‌చరణ్ తెలుసా?: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment