ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఓ సినిమా రూపొందనుంది. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.యన్.ఆర్. చౌదరి నిర్మించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివి. దేశాన్ని రక్షణ వలయంలో ఉంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మానవ రూపంలోని దేవతలు వాళ్లు. వాళ్లే మనకి శివుడు, అల్లా, జీసస్. ఎన్నో ప్రతిఘటనలను, మరెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్య సాహసాలతో, నీతి నిజాయతీలతో తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించనున్నా. పోలీసుల సేవలను వెలుగులోకి తేవడం కోసం ఒక సిన్సియర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? అనే కథతో మా చిత్రం ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment