
సన్నీలియోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె వేసే స్టెప్పులకు కుర్రకారు హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇప్పటికే చాలా స్పెషల్ సాంగ్స్‌లో నర్తించిన సన్ని తాజాగా మరో సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’) ఫేమ్ వైశాక్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా మలయాళంలో ‘మధుర రాజా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2010లో వచ్చిన ‘పోకిరి రాజా’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు.
‘‘మమ్ముట్టిసార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఆ చాన్స్ ఇప్పుడు వచ్చింది. ఇది నాకో మంచి అవకాశం. ఈ సాంగ్ గురించి నాకు తెలుసు. ఏదో సినిమాలో కావాలని పెట్టే పాట కాదిది. చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ విషయం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని సన్ని చెప్పారు. ఈ సాంగ్ కోసం సన్నీలియోన్ ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేశారు. వచ్చే నెలలో కొచ్చిలో ఈ పాట చిత్రీకరణకి ప్లాన్ చేశారు టీమ్. కాగా సన్నీలియోన్ ౖటైటిల్ రోల్‌లో ‘వీరమహాదేవి’ అనే పీరియాడికల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment