చందమామతో బన్నీ చిందులు | Telugu Star Heroine Special Song in Allu Arjun, Trivikram Srinivas's Ala Vaikuntapuramlo | Sakshi
Sakshi News home page

చందమామతో బన్నీ చిందులు

Published Thu, Aug 22 2019 10:09 AM | Last Updated on Thu, Aug 22 2019 10:09 AM

Telugu Star Heroine Special Song in Allu Arjun, Trivikram Srinivas's Ala Vaikuntapuramlo - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్‌ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్‌, టబు, నవదీప్‌, జయరామ్‌, నివేదా పేతురాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ  సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్ నర్తించనున్నారట. గతంలో జనతా గ్యారేజ్‌ సినిమాలో ఎన్టీఆర్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించిన కాజల్‌, ఇప్పుడు బన్నీతో కలిసి ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement