వెంకీ ఐటెం గాళ్ ఎవరో తెలుసా? | Sonam Bajwa lands special song in 'Babu Bangaram' | Sakshi
Sakshi News home page

వెంకీ ఐటెం గాళ్ ఎవరో తెలుసా?

Published Thu, Mar 17 2016 4:28 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

వెంకీ ఐటెం గాళ్  ఎవరో తెలుసా?

వెంకీ ఐటెం గాళ్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బంగారం' సినిమాలో ఓ ముద్దుగుమ్మ ఐటెమ్  సాంగ్  చేయనుందట.  హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో  సోనమ్ బాజ్వా , వెంకీ బాబుతో  కలిసి స్టెప్స్ వేయనుంది.  జిబ్రాన్ సంగీతంలో  ఈ పాట చాలా సూపర్బ్ గా వచ్చిందని చిత్ర సన్నిహిత వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి. కాగా సుశాంత్ హీరోగా  జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఆటాడుకుందాం రా' చిత్‌రంలో  సోనమ్ బజ్వా హీరోయిన్ గా నటించింది. ఇపుడు ఈ అమ్మడు  వెంకీకి ఐటెమ్ గాళ్ గా సరికొత్త అవతారంలో మెరవనుంది.

కాగా  యూత్కి కనెక్ట్ అయితే చాలు  అని భావిస్తున్న మారుతి  అందుకు తగ్గట్టుగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో 'బాబు బంగారం' సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నాడు.  అటు చాలా రోజుల తరువాత ఫుల్లెంగ్త్ కామెడీ రోల్లో , కామెడీ పోలీస్ అధికారిగా నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మంచి ఫాంలో డైరెక్టర్ మారుతిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

వెంకటేష్ కి జోడీగా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి,  ఫిష్ వెంకట్ వంటి కమెడియన్స్ కూడా  ఉన్నారు. ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు  జరుపుకుంటున్న బాబు బంగారం జూన్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement