దేవదాస్‌ : వినాయక చవితి స్పెషల్‌ సాంగ్‌ | Nagarjuna And Nani Devadas Vinayaka Chavithi Special Song | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 12 2018 11:39 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna And Nani Devadas Vinayaka Chavithi Special Song - Sakshi

కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌, లిరికల్‌ వీడియోలతో సందడి చేస్తున్నారు.

తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో సాంగ్‌ను విడుదల చేశారు. మా పండుగ కొంచెం ముందే మొదలయ్యింది అంటూ లక లక లకుమీకర లంభోదర అంటూ సాగే వినాయక చవితి పాటను రిలీజ్‌ చేశారు. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement