ఎఫ్‌-3 మూవీ : ప్రముఖ హీరోయిన్‌ స్పెషల్‌ సాంగ్‌ | Heroine Pragya Jaiwal Special Song In F3 Movie | Sakshi
Sakshi News home page

ఎఫ్‌-3 మూవీ : ప్రముఖ హీరోయిన్‌ స్పెషల్‌ సాంగ్‌

Published Sun, Jun 20 2021 5:18 PM | Last Updated on Sun, Jun 20 2021 6:44 PM

Heroine Pragya Jaiwal Special Song In F3 Movie - Sakshi

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ ఎఫ్‌-3. దిల్‌రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్‌, తమన్నా నటిస్తున్నారు. డబ్బు వల్ల కుటుంబ సభ్యుల మధ్య వచ్చే ఫ్రస్టేషన్‌ను ఫన్నీగా చూపిస్తూ 'F3' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'ఎఫ్ 2' సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తిచేసుకుంది. కరోనా కారణంగా కొత్త షెడ్యూల్‌కు బ్రేక్‌ పడింది. దీంతో వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరలవుతోంది. ఎఫ్‌-3లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ని సంప్రదించారట. ఆమెతో పాటు మరో హీరోయిన్‌ సోనాల్‌ చౌహన్‌ కూడా చిందేయనున్నారట. త్వరలోనే ఈ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ ఉండనుందని సమాచారం. అంతేకాకుండా సునీల్‌ పాత్ర ఆకట్టుకుంటుందని సమాచారం. నటి సంగీత కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందట. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి : 'రాజా విక్రమార్క'గా కార్తికేయ..ఫస్ట్‌లుక్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement