టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌ను వివాదాలు చూట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ పురుషుల సంఘం కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పురుషులందరిని చెడ్డగా చూపించేలా ఈ పాట ఉందని, ఈ సాంగ్ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసింది పురుషుల సంఘం. తాజాగా ఈ పాటకు తమిళంలోనూ వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలోని ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అనే లిరిక్స్ వివాదం రేపుతున్నాయి.
చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్..
దీనిపై తాజాగా తమిళనాడు పురుషుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పాటను తొగించకుంటే పాటకు డ్యాన్స్ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, గేయరచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది. ‘ఓ సొల్రియా’ అనే పాట తమిళంలోనూ సూపర్ హిట్ అయింది. ఈ పాటను తెలుగులో చంద్రబోస్ రాయగా, తమిళంలో గేయరచయిత వివేకా రాశారు. ఇటీవల విడుదలైన ఈ లిరికల్ ఈ పాటకు తెలుగుతో పాటు తమిళంలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
చదవండి: ‘పుష్ప’ మూవీకి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
ఇప్పటికే 20 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాటలో ఉన్న పదాలు పురుష సమాజాన్ని మొత్తం కించపరిచేలా ఉందని, అందుకే ఈ పాటను బ్యాన్ చేయాలంటూ తమిళనాడులోని పురుషుల సంఘం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా రేపు(డిసెంబర్ 17) విడుదలవుతోంది. ఎర్ర చందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏడు భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్ర ఆడియో ఐదు భాషల్లో హిట్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment