Oo Antava In Miami: Samantha Tweet Her Special Song At Ultra Miami Music Festival In USA - Sakshi
Sakshi News home page

ఆనందం పట్టలేక సోషల్‌ మీడియాలో పంచుకున్న సమంత

Published Sun, Mar 27 2022 7:53 PM | Last Updated on Mon, Mar 28 2022 10:10 AM

Samantha Tweet Her Special Song From Pushpa At Ultra Miami Music Festival In USA\ - Sakshi

సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇక విడుదలకు ముందే పుష్ప.. పాటలతో రికార్డులు సృష్టించింది. ఇందులోని రారా సామీ, టైటిల్‌ సాంగ్‌లకు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సమంత నటించిన స్పెషల్‌ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. ఈ పాటను ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన అదే స్థాయిలో రికార్డు క్రియేట్‌ చేసింది. సోషల్‌ మీడియా ఎక్కడ విన్న ఊ అంటావా? పాటే వినిపిస్తోంది.

చదవండి: ఆసక్తికర సన్నివేశాలతో ‘కేజీఎఫ్‌ 2’ ట్రైలర్‌, ఫ్యాన్స్‌కు పండగే..

ఈ మూవీ విడుదలైన నాలుగు నెలలు గడిచిన ఇప్పటికీ ఈ పాట క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. దీనికి తాజాగా జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. ఇంటర్నేషనల్‌ లెవల్‌లో సమంత ఐటెం సాంగ్‌ గుర్తింపు పొందింది. రీసెంట్‌గా అమెరికాలో జరిగిన ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ఊ అంటావా.. ఊ అంటావా పాట వినిపించడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది చూసి సమంత సైతం నమ్మలేకపోయింది. తన పాటకు ఈ రెంజ్‌లో రెస్పాన్స్‌ వస్తుందని ఊహించని సామ్‌ ఆనందం పట్టలేక ఇందుకు సంబంధించిన వీడియోలను, ట్వీట్‌లను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పంచుకుంటుంది.

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై బాబు గోగినేని వివాదస్పద రివ్యూ, ఏమన్నాడంటే

అమెరికాలోని ఫ్లోరిడాలో మార్చిలో అల్ట్రా మైమీ పేరుతో ప్రతి ఏడాది గ్రాండ్‌ మ్యూజిక్ ఫెస్టివల్‏ను నిర్వహిస్తారు.  లక్షలాది మంది ఆడియన్స్ మధ్య ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా నిర్వహించిన ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ వేదికపై సమంత నటించి ఊ అంటావా.. ఊహు అంటావా పాటను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. ఇది నమ్మశక్యం కానీ రిచ్.. పాన్ ఇండియానా కాదు.. పాన్ వరల్డ్ మూవీ పుష్ప’ అంటూ  సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇక అతని ట్వీట్‏ను సమంత రీట్వీట్ చేస్తూ నిజమేనా ? ఇది అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్ లోనా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement