అందుకే... ఈ డ్యాన్స్! | adah sharma starring with shimbhu a special song in idu namma aalu | Sakshi
Sakshi News home page

అందుకే... ఈ డ్యాన్స్!

Published Tue, Mar 22 2016 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

అందుకే... ఈ డ్యాన్స్!

అందుకే... ఈ డ్యాన్స్!

‘హార్ట్‌ఎటాక్’,‘గరం’,‘క్షణం’ తదితర చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న నటి అదాశర్మ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. అందుకు కారణం ఉంది. హీరో శింబు నటిస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ ‘ఇదు నమ్మ ఆళు’ చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆ షూటింగ్‌లో పాల్గొన్న అదా శర్మ, శింబును ప్రశంసల్లో ముంచెత్తేస్తున్నారు. ‘‘శింబు ప్రతిభావంతుడైన డ్యాన్సర్. అతనితో డ్యాన్స్ చేయడం భలేగా ఉంటుంది. అతను అలా సెట్స్‌లోకి వస్తాడు. స్టెప్ ఏమిటని చూస్తాడు. అంతే! చటుక్కున డ్యాన్స్ మొదలుపెట్టేస్తాడు. కేవలం నిమిషాల్లో స్టెప్పులు నేర్చేసుకుంటాడు.

అంత మంచి డ్యాన్సర్‌తో పనిచేస్తుండే సరికి నేను కూడా చాలా ఉత్సాహంగా, కష్టపడి డ్యాన్స్ చేశా’’ అని అదాశర్మ చెప్పుకొచ్చారు. సినిమాలో హీరో పరిచయగీతంగా వచ్చే ‘మామన్ వెయిటింగ్...’ అనే పాట ఇది. ‘‘డ్యాన్స్ నాకున్న ప్రధాన బలం. కానీ, ఇప్పటిదాకా నా ప్రతిభ చూపే అవకాశం రాలేదు. అందుకే, ఈ సినిమాలో ప్రత్యేక గీతమనగానే ఒప్పుకున్నా’’ అని ఈ భామ అన్నారు. అదా ఇప్పటికే రెండు హిందీ సినిమాలకూ, ఒక తమిళ-తెలుగు ప్రాజెక్ట్‌కూ సైన్ చేశారు. ఈ ఏప్రిల్ నుంచి ఆ హిందీసినిమాల్లో ఒకదాని షూటింగ్ మొదలవుతుందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement